Supreme Court Of India: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసుపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ పలుమార్లు స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయినా ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చిన స్పీకర్.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను విచారించలేకపోయారు. ఆ ముగ్గురిపై రెండు వారాల్లోగా విచారణ జరిపి తగు నిర్ణయం ప్రకటించాలని ఇటీవలే సుప్రీం ఆదేశాలు జారీచేసింది.
Supreme Court Of India: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఒక కేసు వేయగా, మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి కలిసి మరో కేసు దాఖలు చేశారు.
Supreme Court Of India: ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు రావడంతో దీన్ని మూడో పిటిషన్‌గా పరిగణించిన కోర్టు.. ఈ పిటిషన్‌ను ఇదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ కేసు విచారణను ఫిబ్రవరి 6 వతేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఆదేశించింది.
