Supreme Court Of India: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో నటించిన థగ్‌లైఫ్ సినిమాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కమల్‌హాసన్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమాపై నిషేధిం విధించారు. దీంతో కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా కర్ణాటక మినహా అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించబడుతున్నది.
Supreme Court Of India: కర్ణాటకలో థగ్‌లైఫ్ సినిమా నిషేధంపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. థగ్‌లైఫ్ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.
Supreme Court Of India: ఎవరైనా ఒకరు వ్యాఖ్య చేసి ఉంటే, దానికి ప్రతిగా ప్రతిఘటించే వ్యాఖ్య చేసే హక్కు ఉంటుంది కానీ, థియేటర్లు తగులబెడతామనే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కర్ణాటక రాష్ట్ర ప్రజలు కమల్‌హాసన్‌తో విభేదించే స్వేచ్ఛ కలిగి ఉంటారని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించవద్దని చెప్పింది.
Supreme Court Of India: చిత్ర నిర్మాతలు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకున్నది. తన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సందర్భంలో నటుడు కమల్‌హాసన్ క్షమాపణ చెప్పాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో ఎట్టకేలకు థగ్‌లైఫ్ సినిమా వివాదం సమసిపోయే అవకాశం కనిపిస్తున్నది.