Supreme court: ప్రపంచమంతా చెట్ల ఆవశ్యకతను గుర్తించి పచ్చదనం వైపు పరుగెడుతుంటే.. ఓ వ్యక్తి నింపాదిగా ఉన్న వందలాది చెట్లను నరికివేసి పర్యావరణ విఘాతానికి పాల్పడ్డాడు. అలాంటి చెట్లను మళ్లీ పొందాలంటే పదుల ఏళ్లు పట్టాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చింది. మరి అలాంటి చెట్లను నరికివేసిన ఆ వ్యక్తికి పెద్ద శిక్షే వేసింది. అలా అన్యాయంగా చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరమైన నేరంగా ఉన్నత న్యాయస్థానం చిత్రీకరించింది.
Supreme court: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాల్మియా వ్యవసాయ క్షేత్రంలో శివశంకర్ అగర్వాల్ అనే వ్యక్తి 454 చెట్లను నరికివేశాడు. అతను చట్ట విరుద్ధంగా చెట్లను నరికివేశాడని వ్యక్తి కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అన్యాయంగా చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరమని, ఇంతటి చెట్ల పచ్చదనాన్ని సృష్టించాలంటే వందేళ్ల సమయం పడుతుందని తెలిపింది.
Supreme court: వందలాది చెట్లను నరికివేసిన శివశంకర్ అగర్వాల్ ఒక్కో చెట్టుకు లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అతని నేరాన్ని తీవ్రమైనదిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. చట్ట విరుద్ధంగా ఇలాంటి విఘాతాలకు పాల్పడటం తీవ్రమైనదిగా పేర్కొన్నది.
Supreme court: నిందితుడు దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పర్యావరణానికి సంబంధించిన విషయాల్లో క్షమాభిక్ష ప్రసక్తి ఉండరాదని నిర్ధ్వంద్వంగా తోసిపుచ్చింది. జరిమానాను తగ్గించాలన్న వినతిని కూడా అత్యున్నత న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది.