Supreme Court: దేశవ్యాప్తంగా వీధి కుక్కలు మరియు పశువుల సమస్యపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది.
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మెరుగుపరచడానికి, వీధి జంతువుల నిర్వహణకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల మీద కనిపించే నిరాశ్రయ జంతువులను (కుక్కలు, పశువులు మొదలైనవి) తొలగించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జాయింట్ కోఆర్డినేటెడ్ డ్రైవ్ చేపట్టాలి.
ఇది కూడా చదవండి: Chevella Bus Accidetnt: చేవెళ్ల రహదారి విస్తరణలో ఎందుకు ఆలస్యం జరిగింది: సుప్రీంకోర్టు కమిటీ సీరియస్
స్కూళ్లు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు వంటి ప్రభుత్వ భవనాల పరిసరాల్లోకి కుక్కలు ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రహదారుల నుంచి తరలించిన కుక్కలు మరియు పశువులకు అవసరమైన సంరక్షణను అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అమికస్ క్యూరీ నివేదిక అమలు తప్పనిసరి
వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికలోని అంశాలను కోర్టు ఆదేశాలలో భాగంగా పరిగణించబడతాయి. రాష్ట్రాలు ఈ నివేదికలో గుర్తించిన లోపాలను సరిచేయడానికి తీసుకున్న చర్యల వివరాలతో కూడిన సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం జరిగితే తీవ్రంగా పరిగణించబడుతుందని బెంచ్ హెచ్చరించింది. డ్రైవ్ అమలుపై 8 వారాల్లోగా స్టేటస్ రిపోర్టును కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.
గతంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. విచారణలో భాగంగా పశువుల సంక్షేమ బోర్డు (AWBI)ను కూడా కేసులో చేర్చడానికి, కుక్కల దాడులకు గురైన బాధితుల దరఖాస్తులకు అనుమతి ఇవ్వడానికి కోర్టు అంగీకరించింది.

