Supreme court: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వేసిన పిటిషన్‌పై సోమవారం (ఫిబ్రవరి 10) సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల చర్యల విషయంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ కావడంతో స్పందించిన అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యేలకు నోటీసులను జారీ చేశారు. తమ నోటీసులపై లిఖితపూర్వక సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
Supreme court: తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ రోజు మళ్లీ ఈ కేసు విచారణ కొనసాగనున్నది.
Supreme court: ఈ దశలో న్యాయస్థానం ఆదేశాలతోనే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇవ్వడంతో, లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చేందుకు కొంత గడువు అడిగారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కడియం శ్రీహరి, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
Supreme court: ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో కూడా కీలక పరిణామం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో హైకోర్టు నాలుగు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆదేశించింది.
Supreme court: ఈ మేరకు ఈ రోజు విచారణకు రానున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారించనున్నది. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఎటువైపు మలుపులు తిరుగుతోందనని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.