Delhi: మాజీ సీఎం జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది, అలాగే ఈ కేసులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లో ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్ పై ఉన్న కేసుల పట్ల అన్ని కోర్టులు ఇప్పటివరకు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించి, వారి ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, కిందికోర్టుల ద్వారా విచారిస్తున్న కేసులపై తీసుకున్న నిర్ణయాలు, వాటి వివరాలు తమకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అయితే, నిందితులందరూ పెద్ద సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడం వల్ల, విచారణ ప్రక్రియ ఆలస్యంగా సాగుతోందని న్యాయవాదులు తెలిపారు.
సుప్రీంకోర్టు, జగన్ అక్రమాస్తుల కేసుల మొత్తం వివరాలను రెండు వారాల్లో అందించాలని ఆదేశించింది. క్రిందకోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు కూడా సమర్పించాలని ధర్మాసనం సూచించింది. తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్ల వివరాలను సిబిఐ, ఈడి తమ సంబంధిత ఛార్జ్ షీట్ల రూపంలో విడివిడిగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ఈ వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది.
రఘురామకృష్ణం రాజు పిటిషన్ పై విచారణ
జగన్ కేసులపై విచారణ నిర్వహించే సమయానికి, రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం, ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.

