Delhi: ఉచితాలపై సుప్రీం కోర్టు సంచలన కామెంట్స్..

Delhi: ఎన్నికల సమయంలో ఉచితాలు ప్రకటించడం విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ధర్మాసనం ఉచిత పథకాలపై సీరియస్ కామెంట్లు చేసింది. ఉచిత రేషన్, ఉచిత నగదు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఆసక్తి చూపడం లేదని కోర్టు పేర్కొంది. ఉచితాల వల్ల ప్రజలు ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారంటూ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసేందుకు ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయా? లేక ఎన్నికల్లో లాభం పొందేందుకు వాటిని ఉపయోగిస్తున్నాయా? అనే చర్చ ఈ వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఉచితాలు ప్రజలకు మేలుకలిగిస్తున్నాయా, లేక పనిచేసే సంస్కృతిని దెబ్బతీస్తున్నాయా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *