Court Movie

Court Movie: కోర్ట్ కి సూపర్ రెస్పాన్స్.. USలో సాలిడ్ ఓపెనింగ్స్!

Court Movie: ప్రియదర్శి మెయిన్ లీడ్ లో యువ నటుడు హర్ష రోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన లేటెస్ట్ థ్రిల్లర్ “కోర్ట్”. నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ తో గ్రాండ్ పైడ్ ప్రీమియర్స్ కూడా జరుపుకొని నేడు రిలీజ్ కి వచ్చింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Also Read: Chiranjeevi: మెగాస్టార్‌కు జీవిత సాఫల్య పురస్కారం – మరో ఘనత!

Court Movie: అదిరే రెస్పాన్స్ అందుకుంది.అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో సాలిడ్ స్టార్ట్ ని అందుకోవడం విశేషం. అక్కడ ఈ సినిమా జస్ట్ ప్రీమియర్స్ తోనే ఏకంగా లక్ష 50 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని రాబట్టడం గమనార్హం. దీనితో యూఎస్ మార్కెట్ లో కోర్ట్ చిత్రానికి ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని నిర్మాణం వహించారు. మంచి టాక్ రావడంతో మున్ముందు ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజిలో ఉంటాయో చూడాలి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bollywood Icons: హాలీవుడ్ కి పోతున్న సల్మాన్, సంజయ్ దత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *