Mandira: పోర్న్ స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపును పొందిన సన్నీలియోన్ కొంతకాలంగా సినిమా నటిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పలు భాషా చిత్రాలలో నటిస్తోంది. ఆమె ప్రస్తుతం కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ చేస్తోంది. తెలుగులోనూ ‘కరెంట్ తీగ, పీఎస్వీ గరుడవేగ, జిన్నా’ చిత్రాలలో నటించింది సన్నీ లియోన్. తమిళంలో సన్నీలియోన్ నటించిన ‘ఓ మై ఘోస్ట్’ చిత్రం 2022 డిసెంబర్ 30న విడుదలైంది. ఈ హారర్ బ్యాక్ డ్రాప్ మూవీని తెలుగులో ‘మందిర’ పేరుతో డబ్ చేసి ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. ఆర్. యువన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జావేద్ రియాజ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను తెలుగు సాయి సుధాకర్ కొమ్మలపాటి విడుదల చేస్తున్నారు.
