JAAT: సన్నీ డియోల్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది! ‘జాట్’ సినిమా తొలిరోజు 18 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. నార్త్ ఇండియాలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జనం ఉప్పెనలా తొక్కిసలాడారు. బుక్ మై షోలో 1.10 లక్షల టికెట్లు గంటల్లో ఖాళీ! కొన్ని ఊళ్లలో జనాలు ట్రాక్టర్లు, బళ్లపై వచ్చి సినిమా చూసి సంబరాలు జరుపుకున్నారు. ఓటీటీ జమానాలో ఇలాంటి క్రేజ్ అరుదైన విషయమే! పాజిటివ్ టాక్‌తో ఈ నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లో ‘జాట్’ 100 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇటీవల వచ్చిన సల్మాన్ ఖాన్ ‘సికందర్’ 150 కోట్ల మార్క్‌ను అందుకోలేకపోయింది. కానీ, ‘జాట్’ ఫుల్ రన్‌లో ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. సన్నీ డియోల్ మాస్ హీరోగా తన హవాను చూపించాడు. ఈ సినిమా విజయం సన్నీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఉంది. ‘జాట్’ జోష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది!
