Sunny Deol Jaat: బాలీవుడ్ లెజెండ్ సన్నీ డియోల్, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా జాట్. మైత్రీ మూవీమేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో సన్నీ డియోల్ ఇంటెన్స్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. భుజంపై భారీ తుపాకీతో ఫెరోషియస్ గా ముందుకు సాగుతున్నాడు. బ్యాక్ డ్రాప్ లో హెలికాప్టర్, కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతున్నాయి. స్టైల్, స్వాగర్‌ను ప్రజెంట్ చేసిన సన్నీ డియోల్ లుక్ అదిరిపోయింది. విశేషం ఏమంటే పుష్ప-2`తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 12, 500 స్క్రీన్స్ లో `జాట్ టీజర్ ను ప్రదర్శించారు. దాంతో మూవీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో సన్నీ డియోల్ తో పాటు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కాసాండ్రా కీలక పాత్రలు పోహిస్తున్నారు.


