Jaat

Jaat: ట్రైలర్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సన్నీ డియోల్!

Jaat: బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ఎవరో కూడా చాలా మంది తెలుగు వాళ్లకి తెలీదు. అలాంటిది అతను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జాట్’ను టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్ యాక్షన్‌తో అదిరిపోయింది. బాలీవుడ్ చిత్రం అయినప్పటికీ, ఇందులోని యాక్షన్ మన తెలుగు సినిమాల్లో కనిపించే మాదిరిగా ఉండటంతో ఇక్కడి ప్రేక్షకులకు ఇది ఇట్టే కనెక్ట్ అవుతుంది. దీంతో సన్నీ డియోల్ పేరు తెలుగులో ట్రెండ్ అవుతుంది.ఇక ఈ సినిమాలో రణతుంగగా రణ్‌దీప్ హుడా పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్రా, సయ్యామి ఖేర్, స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *