Shubman Gill

Shubman Gill: చాలా తక్కువ మందికి ఇస్తా.. గిల్‌కు గావస్కర్‌ గిప్ట్!

Shubman Gill: క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు గావస్కర్‌ ఈ బహుమతిని ఇచ్చారు. ఈ సిరీస్‌లో గిల్ మొత్తం 754 పరుగులు చేసి, ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గావస్కర్‌ నెలకొల్పిన రికార్డును (774 పరుగులు) దాదాపుగా చేరుకున్నాడు.

కేవలం 20 పరుగుల దూరంలో ఈ రికార్డును కోల్పోవడంపై గిల్ నిరాశ చెందినప్పటికీ, గావస్కర్‌ అతడికి మద్దతుగా నిలిచారు. ఆ బహుమతుల్లో గావస్కర్‌ సంతకం చేసిన ఒక క్యాప్, అలాగే తన పేరులోని మొదటి అక్షరాలైన ‘SG’ ఉన్న ఒక షర్ట్ ఉన్నాయి. ఈ బహుమతులు ఇస్తూ గావస్కర్‌, గిల్‌ను అభినందించారు. “నువ్వు నా రికార్డును అధిగమిస్తావని భావించి ఈ బహుమతిని నీ కోసం తెచ్చాను.

ఇది కూడా చదవండి: Medicines Price Cut: గుడ్ న్యూస్ .. 35 మందులపై ధరలు తగ్గించిన కేంద్రం

భవిష్యత్తులో నీకో లక్ష్యం ఉండాలని ఇది ఒక చిన్న గిఫ్ట్. ఈ క్యాప్‌ను నా సంతకంతో చాలా తక్కువ మందికే ఇచ్చాను. ఆల్ ది బెస్ట్” అని గావస్కర్‌ అన్నారు. గిల్ ప్రదర్శనపై గావస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. కెప్టెన్‌గా ఇంత భారీగా పరుగులు చేయడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. మరోవైపు భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తోంది. అయితే, నాలుగో రోజు ఆట వర్షం, వెలుతురు లేకపోవటం వలన నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *