Suniel Shetty: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి భార్యాభర్తల బాధ్యతలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆధునిక యుగంలో దంపతులు ఒకరినొకరు సమర్థించాలని, పిల్లల బాధ్యత భార్య చూస్తే భర్త కెరీర్‌పై దృష్టి పెట్టగలడని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Also Read: War 2: హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్.. రంగంలోకి దిగిన బ్రహ్మాస్త్ర ‘కేసరియా’ టీం
సునీల్ శెట్టి ఇటీవల భార్యాభర్తల బాధ్యతలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. దంపతులు రాజీపడాలని, పిల్లల సంరక్షణ భార్య చూసుకుంటే భర్త కెరీర్‌పై దృష్టి పెట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు పురుషాధిక్య ధోరణిని ప్రతిబింబిస్తున్నాయంటూ ఫెమినిస్టులు విమర్శలు గుప్పిస్తున్నారు. భార్య భర్తల ఇద్దరికీ కూడా పిల్లలపై, కెరీర్ పై సమాన బాధ్యతలు ఉండాలని వాదిస్తున్నారు. కొందరు ఆయన మాట్లాడటం మానేయాలని, మౌనంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. మరికొందరు ఈ వ్యాఖ్యలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీశాయని అంటున్నారు. ఈ చర్చ ఆధునిక సమాజంలో బాధ్యతల విభజనపై కొత్త కోణాన్ని తెరతీసింది.