ఆగ్నేసమ్మ గారు ఒకప్పుడు విశాఖపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేశారు. విద్యారంగానికి ఆమె అందించిన సేవలు అమూల్యమైనవిగా నిలిచాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, జీవిత మార్గాన్ని చూపిన ఆమె స్థానికంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమెను ‘నిజమైన గురువు’గా గుర్తుచేసుకుంటున్నారు.
ఈ విషాదాన్ని సందీప్ కిషన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన నానమ్మ, తాతయ్యల ప్రేమకథను గుర్తు చేస్తూ భావోద్వేగంతో ఓ పోస్టు చేశారు.
“నిన్న మా నానమ్మ మమ్మల్ని విడిచిపెట్టారు. మా తాతయ్య జోసెఫ్ కృష్ణం నాయుడు షిప్ ఆర్కిటెక్ట్. నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి విశాఖలో ఉపాధ్యాయురాలు. 1960లో మతాంతర వివాహం చేసుకుని, తమ పేర్లను మార్చుకుని ఆదర్శ దంపతులుగా నిలిచారు. వారి ప్రేమకథ నా జీవితానికి స్ఫూర్తి” అంటూ తెలిపారు.
ఇది కూడా చదవండి: Kajal Aggarwal: కాజల్ సంచలన నిర్ణయం.. బోల్డ్ రోల్‌తో పాటు మెగా ప్లాన్ ?
మంగళవారం, విశాఖపట్నంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. సందీప్ కిషన్ తన మామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడుతో కలిసి నానమ్మకు కడసారి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సందీప్ స్వయంగా పాడె మోసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు సందీప్‌కి సంతాపం తెలియజేస్తూ ధైర్యం చెబుతున్నారు.
ఆగ్నేసమ్మగారి జీవితం, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
విద్యారంగంలో ఆమెకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆమె మృతితో టాలీవుడ్‌తో పాటు విద్యాభ్యాస రంగం కూడా ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది.