Summer Holidays 2025: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై చివరికి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. అనేక ఊహాగానాలకు తెరదిస్తూ విద్యాశాఖ 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులకు చెక్ పెట్టుతూ, ఎప్పుడు సెలవులు మొదలవుతాయన్న అనుమానాలకు ఈ ప్రకటన తీరైన సమాధానమైంది.
ఏప్రిల్ 24నుంచి సెలవుల ఆరంభం – జూన్ 11వరకూ విశ్రాంతి
విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు అమలులో ఉంటాయి. జూన్ 12న తిరిగి పాఠశాలలు తెరవనున్నాయి. అంటే విద్యార్థులకు మొత్తం 46 రోజులపాటు విశ్రాంతి లభించనుంది.
ఈ క్రమంలో ఏప్రిల్ 23వ తేదీతో స్కూల్ క్యాలెండర్ ముగియనుంది. అదే రోజు విద్యార్థుల వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. ఫలితాలు కూడా అదే రోజున ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Pahalgam Attack: పెళ్లైన ఆరు రోజులకే.. పహల్గామ్ దాడిలో నేవీ అధికారి మృతి
ఇంటర్ కాలేజీలకు షెడ్యూల్
ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెలవులు త్వరగానే ముగుస్తాయి. జూన్ 2నుంచే ఇంటర్ కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. కళాశాలల స్థాయిలో తరగతుల ప్రణాళిక, పాఠ్య పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయి.
పుస్తకాల పంపిణీకి భారీ ఏర్పాట్లు
జూన్ 12న బడులు తిరిగి ప్రారంభమయ్యే రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సుమారు 4.5 కోట్ల పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు
ఇక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత దృష్ట్యా మార్చి 18 నుండి ఒంటిపూట బడులు అమల్లోకి వచ్చాయి. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడుస్తున్నాయి. ఇదే తరహా వేడికి ఈ సంవత్సరం కూడా ఎదురవ్వొచ్చన్న అంచనాల మధ్యే తెలంగాణలో వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి.