Sukumar: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అనుకోని పరిస్థితులలో జైలుకు వెళ్లి.. బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం ఏడు గంటలకు జైలు నుంచి విడుదలైన ఆయన నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ తన న్యాయవాదులతో చర్చించిన తరువాత ఇంటికి చేరుకున్నారు. బన్నీ ఇంటికి చేరుకున్న సమయంలో ఇంటి వద్ద ఎమోషనల్ వాతావరణం నెలకొంది. తన భార్యా పిల్లలను ఆలింగనం చేసుకున్న అల్లు అర్జున్ కు తరువాత దిష్టి తీసి ఇంటిలోకి తీసుకువెళ్లారు.
బన్నీ ఇంటికి చేరుకున్న కొద్దిసేపటి తరువాత నుంచి అయన ఇంటికి సినీ ప్రముఖులు రావడం ప్రారంభమైంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు, సుకుమార్, విజయ్ దేవరకొండ, కొరటాల శివ, దిల్‌రాజ్, వంశీ, అల్లు అర్జున్ మేనత్త, చిరంజీవి సతీమణి సురేఖ, టీడీపీ ఎమెల్యే గంట శ్రీనివాస రావు, డైరెక్టర్ హరీష్ శంకర్, ఇలా చాలామంది సినీ ప్రముఖులు వరుసగా వస్తూనే ఉన్నారు. వారిని అల్లు అర్జున్ కలుస్తున్నారు. అందరూ అల్లు అర్జున్ కు తమ సంఘీభావాన్ని చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక ఎమోషనల్ సీన్ అందరినీ కదిలించింది.
ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు..
Sukumar: దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ ను కలిశారు. ఈ సమయంలో బాగా ఎమోషనల్ అయిన సుకుమార్ కంట తడిపెట్టారు. దీంతో ఆయనను అల్లు అర్జున్ ఓదార్చడం కనిపించింది. అల్లు అర్జున్ ను చూసి కంటతడి పెట్టుకున్న సుకుమార్ ను చూసిన అక్కడున్న వారంతా ఎమోషన్ అయ్యారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అల్లు అర్జున్ అభిమానులు ఈ వీడియో చూసి సుకుమార్ కి బన్నీతో ఉన్న అనుబంధం అంత గొప్పది అని చెప్పుకుంటున్నారు.
#Sukumar sir ” We Love You ” ♥️🥺@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/aq4S8cvitj
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024

