Suicide: ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అవుతానని ఓ విద్యార్థినిలో భయం పట్టుకున్నది. అందరిలో చులకన అవుతాననే గిల్టీగా ఫీల్ అయింది. ఇంటిలో బాధపడుతారేమోనని ఆవేదన వ్యక్తంచేసింది. జీవితంలో ఏం సాధించలేకపోతాననే బాధతో మనస్తాపం చెందింది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది.
Suicide: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లికి చెందిన ప్రణీత (18) అనే విద్యార్థిని ఇటీవలే పరీక్షలు రాసింది. ఏప్రిల్ నెలలో 28న ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ లోగా పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయం ఆమెలో పట్టుకున్నది. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయంలో బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకొని చనిపోయింది.
Suicide: మరో విషయమేమిటంటే ఆమె పుట్టినరోజు సందర్భంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవడం. గత కొన్ని రోజులుగా తన కూతురు పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే ఆవేదనతో ఉన్నదని ఆ యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. పరీక్షలు సరిగా రాయలేదని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.