Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. లక్షలాది రూపాయలు నష్టపోయి నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు. అప్పులు తీర్చేదారి లేక, అవమానంగా భావించి మనస్తాపంతో తనువు చాలించాడు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరచూ జరుగుతున్నా, ఇంకా మేలుకొనకపోవడం గమనార్హం. బెట్టింగ్ యాప్‌ల మాయలో పడి ఎందరో ఇలా తనువులు చాలిస్తున్న వైనం ఆందోళన కలిగించకమానదు.
Suicide: ఏపీలోని వైఎస్సార్ జిల్లాకు చెందిన అఖిల్ (31) అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గత కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నాడు. ఏలూరు వెళ్తున్నానని ఇంటిలో తల్లిదండ్రులకు చెప్పిన అఖిల్.. అదే పట్టణంలోని ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకున్నాడు. తన తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ వల్ల నష్టపోయానని, అప్పులు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు వాళ్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారని తెలిపి అదే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు.
Suicide: అయితే అఖిల్‌తో ఫోన్‌లో మాట్లాడిన సమయంలోనే తండ్రి నచ్చచెప్పాడు. ఇంటికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందామని, బాధపడొద్దని, అప్పులైతే తీరుద్దామని చెప్పాడు. ఈ లోగా హోటల్ గదిలో ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానంతో ఆ హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులను పగులగొట్టి చూడగా, అఖిల్ అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

