Suicide:

Suicide: ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక మ‌రో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Suicide: వేలు, ల‌క్ష‌ల్లో జీతాలు.. విలాస‌వంత‌మైన జీవితం.. వీకెండ్ స‌ర‌దాలు.. అన్న‌ది నాణేనికి ఒక‌వైపు ఉన్న‌ట్టుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కుటుంబాల జీవితాలు ఉన్నాయ‌ని బోధ‌ప‌డుతున్న‌ది. లక్ష‌ల్లో వేత‌నాలు ఉన్నా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో త‌నువు చాలించింది ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్‌లీడ‌ర్‌గా ప‌నిచేసే ఓ మ‌హిళ‌. అదే ల‌క్ష‌ల్లో వేత‌నం ఉన్నా మ‌రో స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి మ‌రో యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందింది. ఇదే కోవ‌లో ఉద్యోగంలో ఒత్తిడిని త‌ట్టుకోలేక మ‌రో యువ‌కుడు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ మూడు ఘ‌ట‌న‌లో నాలుగు రోజుల్లో హైద‌రాబాద్ ప‌రిధిలో జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

Suicide: హైద‌రాబాద్ న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి ప్రాంతంలోని యాక్సెంచ‌ర్ కంపెనీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అమ‌లాపురం ప్రాంతానికి చెందిన స‌తీశ్ (31) అనే వ్య‌క్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్త‌న్నాడు. న‌గ‌రంలోని మియాపూర్ ప‌రిధిలోని బీకే ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటూ విధుల‌కు వెళ్లి వ‌స్తుంటాడు. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న విధుల్లో ప‌ని ఒత్తిడిని త‌ట్టుకోలేక‌పోతున్న‌ట్టు మ‌ద‌న ప‌డేవాడ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

Suicide: ఇటీవ‌లే స‌తీశ్ భార్య సంక్రాంతి సెల‌వుల‌కు సొంతూరు వెళ్లింది. ఇంకా తిరిగి రాలేదు. ఈ లోగా ప‌ని ఒత్తిడి మ‌రింత పెర‌గ‌డం, ఒంట‌రిగా ఉండ‌టాన్ని త‌ట్టుకోలేక పోయాడో ఏమో కానీ, తాను ఉండే ఇంటిలోనే ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చిన పోలీసులు.. కుటుంబ స‌భ్యులు వివ‌రాల ప్ర‌కారం.. ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేకే స‌తీశ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని నిర్ధారించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *