Jatadhara: సుధీర్ బాబు ‘జటాధర’కు సెన్సార్ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాతో సోనాక్షీ సిన్హా తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఇందులో ధన పిశాచి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీలో రిలీజ్ అవుతుంది. ఇందులో శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: Andhra King Taluka: మెస్మరైజింగ్ మెలోడీగా ఆకట్టుకుంటున్న చిన్ని గుండెలో!
సుధీర్ బాబు హీరోగా, సోనాక్షీ సిన్హా కీలక పాత్రలో నటిస్తున్న ‘జటాధర’కు సెన్సార్ పూర్తి అయింది. ఈ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాతో సోనాక్షీ మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఆమె ధన పిశాచి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలో నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ మరో కీలక పాత్ర పోషిస్తుంది.ఆమె ‘బ్రహ్మ’ సినిమా తర్వాత తెలుగు తెరకు తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో ఇందిరా క్రిష్ణ, రవి ప్రకాష్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా బ్యానర్లు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నాయి. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

