Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న “జటాధర” ట్రైలర్ విడుదలైంది. ఈ థ్రిల్లర్ చిత్రం కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో టాక్ మారింది. సుధీర్ బాబుకి ఈసారి హిట్ గ్యారెంటి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: RGV: దర్శకుడు ఆర్‌జీవీపై కేసు నమోదు!
నవదలపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కలిసి నటిస్తున్న “జటాధర” చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ నుంచి విడుదలైన ట్రైలర్ సినీ అభిమానులను ఆకర్షించింది. ట్రైలర్‌లోని శక్తివంతమైన కంటెంట్, సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సోషల్ మీడియాలో ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపనుందనేది ఆసక్తికరం. ట్రైలర్‌తో వచ్చిన ఈ హైప్‌ను మేకర్స్ రిలీజ్ వరకు కొనసాగించగలిగితే, “జటాధర” సుధీర్ బాబు కెరీర్‌లో మరో విజయాన్ని నమోదు చేయవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.