Sudarshan Reddy: ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి

Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాల అనంతరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఎన్నికల తీర్పును స్వీకరిస్తున్నానని, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రయాణం తనకు గొప్ప గౌరవాన్ని, విలువైన అనుభవాన్ని ఇచ్చిందని, న్యాయం కోసం మరియు ప్రతి వ్యక్తి గౌరవం కోసం నిలబడే అవకాశం కలిగిందని ఆయన తెలిపారు.

తనను కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన సుదర్శన్ రెడ్డి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *