Students Suicide: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలై మనస్తాపం చెందిన ఐదుగురు విద్యార్థులు తనువులు చాలించారు. క్షణికావేశంతో తీసుకున్న ఈ నిర్ణయంతో వారు తమ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. ఓ విద్యార్థిని అనుకున్న ప్రకారం మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం శోచనీయం.
Students Suicide: సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఉన్నా, ఒక ఏడు వెనక్కి వెళ్లినా జీవితానికి వచ్చే ఢోకా లేదని తెలిసినా తోటి విద్యార్థుల్లో చులకన అవుతామేమోనన్న బాధతో వారు ఇలా చేసుకోవడం ప్రతి ఒక్కరిలో ఆవేదనను కలిగిస్తున్నది. ఫలితాలు ఇలా వచ్చాయో రాలేదో.. అలా చూడగానే వెంటనే ఆందోళన చెందిన వారంతా ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కలిచివేస్తున్నాయి.
Students Suicide: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని అశ్వితకు తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెందింది. ఎంతో వ్యథ చెందింది. తల్లిదండ్రులు ఏమంటారనుకున్నదో, స్నేహితుల వద్ద చులకన అవుతానని అనుకున్నదో? ఏమో కానీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తీర్ణురాలైనా తక్కువ మార్కులు వచ్చాయని తనువు చాలించడంపై కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Students Suicide: హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని అవంతినగర్‌కు చెందిన విద్యార్థి బల్కంపేటలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష ఫలితాల్లో ఫెయిలైనట్టు తేలడంతో ఆవేదనకు గురయ్యాడు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Students Suicide: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. సెకండియర్ ఫలితాల్లో ఆమె అనుకున్నన్ని మార్కులు రాలేదని మనస్తాపం చెందింది. ఇంట్లో చెప్పుకొని దుఃఖభారంతో మునిగింది. కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఈలోగా ఆత్మహత్యకు పాల్పడింది.
Students Suicide: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోలు తట్టి అన్నారంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన మరో విద్యార్థిని ఇంటర్ బైపీసీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఎంతో బాధపడింది. తెలిసిన వారిలో, తోటి విద్యార్థుల్లో పరువు పోతుందని బాధపడింది. ఇంటిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
Students Suicide: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన విద్యార్థి స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదివాడు. పరీక్షల్లో ఫెయిలైన విషయం తెలియగానే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరీక్షల ఫలితాలు రాగానే మనస్తాపంతో ఒకేరోజు తనువులు చాలించడం శోచనీయం.