Student Suicide:

Student Suicide: మెట్రో స్టేష‌న్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

Student Suicide: ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యానని మ‌రో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. హైద‌రాబాద్‌లోని ఓ మెట్రో స్టేష‌న్‌పై నుంచి దూకి ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప‌రీక్ష‌ల్లో క్వాలిఫై కాలేద‌ని గ‌త కొంత‌కాలంగా డిఫ్రెష‌న్‌లోకి వెళ్లిన ఆ విద్యార్థి జూన్ 28న కోచింగ్‌కు వెళ్తున్నాన‌ని చెప్పి మెట్రో స్టేష‌న్‌పైకి వెళ్లి కిందికి దూకి బ‌ల‌వ‌న‌ర్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

Student Suicide: హైద‌రాబాద్ మీర్‌పేట‌కు చెందిన విద్యార్థి హ‌ర్షిత్ (17) గ‌త నెల‌లో విడుద‌లైన జేఈఈ ప‌రీక్ష‌ల్లో క్వాలిఫై కాలేక‌పోయాడు. దీంతో మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. ఆ రోజు నుంచి డిప్రెష‌న్‌లోకి వెళ్లాడు. మ‌ళ్లీ కోచింగ్ తీసుకుంటాన‌ని ఇంట్లో చెప్పాడు. నిన్న కోచింగ్ కోస‌మ‌ని బ‌య‌ట‌కు వెళ్లాడు. సరిగ్గా విక్టోరియా మెమోరియ‌ల్‌ మెట్రోస్టేష‌న్ వ‌ద్ద‌కు వెళ్లాడు.

Student Suicide: అక్క‌డి నుంచి హ‌ర్షిత్ త‌న‌ త‌ల్లికి ఫోన్ చేశాడు. అమ్మా డిప్రెష‌న్‌లో ఉన్నా.. త‌ట్టుకోలేక‌పోతున్నా.. అంటూ ఆవేద‌న వ్య‌క్తంచేశాడు. ఆ త‌ర్వాత విక్టోరియా మెమోరియ‌ల్ మెట్రో స్టేష‌న్ పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న‌కు ఫోన్ చేసిన కొద్దిసేప‌ట్లోనే కొడ‌కు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో గుండెలవిసేలా త‌ల్లి రోదించ‌సాగింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bus Accident: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బ్రేకులు ఫెయిలైన బ‌స్సు.. 40 ప్ర‌యాణికుల ప్ర‌యాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *