Student Suicide: ఇటీవల పిల్లలు క్షణికావేశాలకు లోనై తమ ప్రాణాలను తృణప్రాయంగా తీసుకుంటున్నారు. నిండు జీవితాన్ని మధ్యలోనే చాలించుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పరిస్థితులు ఉన్నా, వారికి తోచిందు తడవుగా ఆలోచించకుండా, అమ్మానాన్నలు, తోబుట్టువులను గుర్తు చేసుకోకుండా ఈలోకం విడిచి దూరంగా వెళ్లిపోతున్నారు. అవమానాలు, చీత్కరింపులు, ఇష్టంలేని వాతావరణం, వెక్కిరింతలు ఇలా ఏదైనా కారణం కావచ్చు. కానీ, అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడంపై మానసిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Student Suicide: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన కృపాకర్ చిన్న కూతురు కీర్తన (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. ఆ కళాశాలలో లెక్చరర్లు చెప్పే పాఠాలు అర్థంకావడం లేదని ఇటీవలే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతోపాటు తల్లిదండ్రులను విడిచి పెట్టి దూరంగా ఉండలేకపోతున్నది.
Student Suicide: ఆయా విషయాలతో ఆమెను మరో కళాశాలలో చేర్పించే ప్రయత్నంలో ఉండగానే, ఇంటికి వచ్చిన ఆ యువతి ఇంటిలో ఎవరూ సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసమని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులు గడిస్తే సమీపంలో ఉండే మరో కళాశాలలో ఆ కుటుంబ సభ్యులు చేర్పించేవారు. అప్పటిదాకా ఓపిక పట్టలేక అకారణంగా ప్రాణాలు తీసుకున్నదని బంధుమిత్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.