Khammam: హైదరాబాద్‌లో ఇటీవల విద్యార్ధుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హయత్‌నగర్‌లోని కుంట్లూరు మైనార్టీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని సౌమ్య హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగుల మండలం అంబగిరి గ్రామానికి చెందిన ఉడత నూరి శివశంకర్ కుమార్తె సౌమ్య ఇంటర్ సెకండియర్ చదువుతోంది. సాయంత్రం 7 గంటల సమయంలో తోటి విద్యార్థినిలు డిన్నర్ చేసేందుకు వెళ్లగా తరగతిదిలోకి వెళ్లి తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థిని కాలేజీ హాస్టల్ ప్రిన్సిపాల్ కమ్ వార్డెన్ విజయలక్ష్మి సమాచారం ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో వెంటనే కిందికి దించింది.
అనంతరం ప్రిన్సిపాల్, వార్డెన్ విజయలక్ష్మికి సమాచారం ఇవ్వడంతో… వచ్చి దగ్గరలోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డెడ్‌బాడీనీ పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు.

