Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కందనవెల్లికి చెందిన భావన గరునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది.
క్యాంపస్ హాస్టల్‌లోనే ఉంటున్న ఆమె కాలేజీ వార్షికోత్సవంలో అవార్డు తీసుకోవాల్సి ఉంది.అయితే, గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి రెండు గంటల పాటు భావన ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా.. భావన ఆత్మహత్యకు గురునానక్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఏబీవీపీ, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు వేర్వేరుగా ఆందోళన చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

