SC on Stray Dogs: వీధుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని వాటిని షెల్టర్ హోమ్‌లలో ఉంచాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఇచ్చింది ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కొందరు దీన్ని సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు విచారణకు రాగా, కోర్టు తన తుది తీర్పును రిజర్వ్ చేసింది.
SG తుషార్ మెహతా ఆందోళన
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో మాట్లాడుతూ..
వీధి కుక్కల సమస్య రెండు కోణాల్లో చూడాలి .. ఈ విధి కుక్కల గురించి మాట్లాడేవారు వీరు వాటిని ప్రేమిస్తారు ఎక్కడైనా కనిపిస్తే ఆహారం పెటేవారు, వాటికీ ఏవైనా సమస్యలు వస్తే వాటి గురించి మాట్లాడేవారు. ఇంకో కోణంలో విధి కుక్కల వల్ల నేరుగా ఇబ్బంది పడేవారు. అవి కరవడం వల్ల చిన్న పిల్లలు చనిపోతున్నారు, కుక్కలు బయట ఆడుకుంటున్న చిన్న పిల్లల మీద దాడి చేస్తున్నాయి అని అన్నారు.
2024లో దేశంలో 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయని, అదే సంవత్సరం రేబిస్ వల్ల 305 మరణాలు జరిగాయని WHO గణాంకాలను కోర్టు ముందు సమర్పించారు. “ఎవరూ జంతువులను ద్వేషించడం లేదు. కానీ ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యం” అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: IOA Approves Bid: 2030 కామన్వెల్త్ క్రీడల బిడ్‌కు అధికారికంగా ఆమోదం
వ్యతిరేక వాదనలు
సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ మాట్లాడుతూ..
సుమోటోగా కేసు తీసుకుని ఆర్డర్ ఇవ్వడం సరైనది కాదు. ఇంకా షెల్టర్లు కాటనే లేదు పరిస్థితిలో కుక్కలను పట్టి వాటిని ఒక్క ప్లేసులో పెట్టడం మరింత ప్రమాదకరం అన్నారు. ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలి విజ్ఞప్తి చేశారు.
అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ..
మిస్టర్ మెహతా పాక్షిక దృష్టితో పార్లమెంటు సమాధానంలో రేబిస్ మరణాలు లేవని ఉంది. పరిస్థితి అంత భయంకరంగా లేదు అన్నారు.
సుప్రీంకోర్టు స్పందన
జస్టిస్ నాథ్ వ్యాఖ్యానిస్తూ..
మున్సిపల్ కార్పొరేషన్ నిష్క్రియాత్మకత వల్లే ఈ పరిస్థితి వచ్చింది. స్థానిక అధికారులు తమ బాధ్యత తీసుకోవాలి అని అన్నారు.
అంతిమంగా, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈలోగా, మున్సిపల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు వీధి కుక్కల సమస్యపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

