Stranger Things: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్-5 రెండో వాల్యూమ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మొదటి వాల్యూమ్‌లో నాలుగు ఎపిసోడ్లు విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. భారత్‌లో ఉదయం నుంచి ఈ వాల్యూమ్ అందుబాటులో ఉంది.
Also Read: Dhurandhar: ధురంధర్ విమర్శకులకు దర్శకుడి బలమైన స్పందన!
నెట్‌ఫ్లిక్స్ ఓరిజినల్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ అనేది ప్రపంచవ్యాప్త ఓటీటీ ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన వెబ్ సిరీస్. ఇప్పుడు దాని ఫైనల్ సీజన్ అయిన సీజన్-5 స్ట్రీమింగ్ కొనసాగుతోంది. మిగతా సీజన్ల మాదిరిగా ఒకేసారి అన్ని ఎపిసోడ్లు విడుదల చేయకుండా ఈసారి వాల్యూమ్స్‌గా విభజించి రిలీజ్ చేస్తున్నారు. గత నెల మొదటి వాల్యూమ్‌గా నాలుగు ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి. సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు రెండో వాల్యూమ్‌గా మూడు ఎపిసోడ్లు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. భారత్‌లో ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి ఈ ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి. రీజనల్ భాషల్లో డబ్బింగ్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ అభిమానులు ఎప్పటి నుంచో ఈ ఎపిసోడ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విడుదలతో వారి ఆసక్తి తీరిపోయింది. మరి ఈ ఎపిసోడ్స్ ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.
