Stranger Things: ప్రపంచవ్యాప్తంగా అపార పాపులారిటీ సంపాదించిన స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఫైనల్ సీజన్ రెండో భాగం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ రిలీజ్ టైమింగ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇండియాలో ఈ ఎపిసోడ్స్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయో తెలుసుకుందాం.
Also Read: Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర?
స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానుల బేస్ కలిగిన సెన్సేషనల్ షో. ఫైనల్ సీజన్ 5ను మేకర్స్ భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. గత నవంబర్‌లో వచ్చిన పార్ట్ 1లోని నాలుగు ఎపిసోడ్స్‌కు అద్భుత స్పందన లభించింది. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ డేట్ ఖరారైంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా గ్లోబల్ రిలీజ్ టైమింగ్‌ను అనౌన్స్ చేసింది. యునైటెడ్ స్టేట్స్లో డిసెంబర్ 25న సాయంత్రం 5 గంటల నుంచి, అలాగే 8 గంటల నుంచి వరుసగా ఎపిసోడ్స్ ప్రీమియర్ అవుతాయి. ఈ టైమింగ్ ప్రకారం ఇండియాలో డిసెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 6 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. మునుపటి పార్ట్ కూడా ఇదే సమయంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో వేర్వేరు సమయాల్లో రిలీజ్ అవుతున్న ఈ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరి ఎపిసోడ్ మాత్రం న్యూ ఇయర్ కానుకగా రానుంది.
