Stock Market: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక ఆర్థిక నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకంగా ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లను (సుంకాలను) 90 రోజుల పాటు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయం భారత దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్‌ను నింపింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
భారీ లాభాలతో మార్కెట్ల ప్రారంభం
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,165 పాయింట్లు ఎగబాకి 75,012 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 22,774 వద్ద కొనసాగింది. దేశీయంగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 51 పైసలు పెరిగి 86.18 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా మెటల్, ఫార్మా, ఆటో రంగాల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది.
ఇంటర్నేషనల్ మార్కెట్లలో మిశ్రమ ప్రభావం
ట్రంప్ టారిఫ్ సడలింపు నిర్ణయం అనేక దేశాలకు ఊరట కలిగించినప్పటికీ, చైనా పై దూకుడు కొనసాగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మదుపరుల లోటు భావనను పెంచాయి. దీంతో వాల్‌స్ట్రీట్ గురువారం నష్టాల్లో ముగిసింది — S&P సూచీ 3.5%, డోజోన్స్ 2.5%, నాస్‌డాక్ 4.3% మేర నష్టపోయాయి.
Also Read: Helicopter Crash: అమెరికాలో దారుణం హెలికాప్టర్ కుప్పకూలి, సీమేన్స్ CEO కుటుంబం మృతి
TCS త్రైమాసిక ఫలితాలు – ఆశించిన స్థాయిలో లాభాలు లేవు
ఇక దేశీయంగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయిన కంపెనీ షేరు ధరలు కొంత నష్టాల్లో కనిపించాయి.
మార్కెట్ బలంగా నిలవనుందా?
ఈ పరిణామాల నేపథ్యంలో, సెన్సెక్స్ 1.70% లాభంతో 75,101 వద్ద, నిఫ్టీ 1.68% పెరిగి 22,774 వద్ద ట్రేడవుతోంది. 30 స్టాక్స్‌లో 25 గ్రీన్ మార్క్, అంటే లాభాల్లో ఉండగా, కేవలం 5 మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, టాటామోటార్స్, హిందాల్కో, గ్రాసిమ్ వంటి షేర్లు భారీ లాభాలను సాధించాయి.

