Stock market: ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 397 పాయింట్ల లాభంతో 82,307 వద్ద ముగిసింది. మార్కెట్లో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సూచీలు పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి.
అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 132 పాయింట్లు పెరిగి 25,289 వద్ద ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్, మెటల్, ఫార్మా వంటి రంగాల్లో కొనుగోళ్లు జరగడం మార్కెట్‌కు ఊతమిచ్చింది.
మొత్తంగా పెట్టుబడిదారుల్లో సానుకూల భావన కొనసాగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, కంపెనీల ఫలితాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు తెలిపారు.
