AUS vs SL

AUS vs SL: శ్రీలంకతో మొదటి టెస్ట్ లో చెలరేగుతున్న ఆసీస్..! స్మిత్, ఖవాజా సెంచరీలు

AUS vs SL: ఈసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు గాను ముందే అర్హత సాధించేసిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఈ డబ్ల్యుటిసి సైకిల్ లో చివరి సిరీస్ గా శ్రీలంకతో అక్కడి మైదానాల్లోనే రెండు మ్యాచ్ ల సిరీస్ ను ఆడుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు ముందు దీనిని ఒక ప్రాక్టీస్ సిరీస్ గా భావించవచ్చు. అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఎంతో అనూహ్యంగా ఆస్ట్రేలియా దుర్భేద్యమైన స్థితిలో ఉండడం గమనార్హం.

ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఇక స్పిన్ కు అనుకూలించే పిచ్ పైన కొత్త బంతితో వీలైనంత ఎక్కువ పరుగులు చేయాలి అన్న కృత నిశ్చయంతో వచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు ఒక సిక్షర్ సాయంతో 57 పరుగులు సాధించాడు.

మొదట్లో పేస్ బౌలింగ్ ను తుత్తునియలు చేసిన హెడ్ ఆ తర్వాత స్పిన్నర్లను లను కూడా వదలలేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో అతను ఎల్బిడబ్ల్యూ అయినప్పటికీ శ్రీలంక ప్లేయర్లు రివ్యూ తీసుకోకపోవడంతో ఊపిరిపీల్చుకున్న హెడ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అయితే ఇదే ఊపులో ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో భారీషాట్ కు ప్రయత్నించి వెనుదిరిగాడు. మరొకవైపు ఖవాజా కూడా హెడ్ అంత కాకపోయినా ఒక రకంగా ధాటిగానే ఆడాడు. హెడ్ అవుట్ అయిన కొద్దిసేపటికి అతను కూడా తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.

AUS vs SL: హెడ్ వికెట్ తర్వాత వచ్చిన లబుషెన్ కేవలం 20 పరుగులు మాత్రమే సాధించి అవుట్ అయ్యాడు. దీంతో అందరూ శ్రీలంక ఎప్పటిలాగే పుంజుకుంటుంది అనుకున్నారు కానీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. అతనితో కలిసి మరొక సీనియర్ ప్లేయర్ అయిన ఉస్మాన్ ఖవాజా ఏకంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని మూడవ వికెట్ కు నెలకొల్పాడు.

ముఖ్యంగా స్పిన్నర్లను వీరిద్దరూ అలవోకగా ఆడేయడం గమనార్హం. పిచ్ నుండి కూడా బౌలర్లకు పెద్దగా సహకారం లభించకపోవడంతో ఇద్దరూ క్రేజీలో పాతుకునిపోయారు. ఒక స్థాయి తర్వాత శ్రీలంక బోర్డర్లు లీగ్ స్టంప్ అవతలకు బంతివేసి వారిని పరుగులు చేయనీయకుండా, ఉండేందుకు ప్రయత్నించారు. ఆ విధంగా వీరి పరాక్రమం సాగింది. ఈ క్రమంలో ఖవాజా 147 పరుగులతో, స్మిత్ 104 పరుగులతో సెంచరీలు సాధించి నాట్ అవుట్ లుగా నిలిచారు.

ALSO READ  IND vs NZ: రెండో టెస్ట్ లో పటిష్ట స్థితిలో న్యూజిలాండ్.. మూడోరోజు టీమిండియా ఏం  చేస్తుందో?

చివర్లో వర్షం పడి కొద్దిసేపు ఆట కోల్పోయారు కానీ మొత్తానికి మొదటి రోజు ఆస్ట్రేలియా 320 పరుగులకు కేవలం రెండు వికెట్ల కోల్పోయి అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక ఆటో రెండో రోజైనా పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అన్న ఆశతో ఉన్నారు శ్రీలంక బౌలర్లు. లేని పక్షంలో వారు ఇక ఈ మ్యాచ్ ను గెలిచే పరిస్థితులు అయితే కనిపించడం లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *