Stampede At Temple: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో శనివారం ఉదయం చోటు చేసుకున్న తొక్కిసలాట (Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది భక్తులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఘోర ప్రమాదానికి కారణాలు
ఏకాదశి పర్వదినం కావడంతో కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇదే తొక్కిసలాటకు ప్రధాన కారణమైంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని తట్టుకోలేక ఒక్కసారిగా ఆలయంలోని రెయిలింగ్ (రక్షణ కంచె) ఊడిపోయింది. దీంతో, ఒకరిపై ఒకరు పడిపోయి ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: Viral News: వివాహ బంధంతో ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయి
భద్రతా లోపాలపై తీవ్ర ఆరోపణలు
తొక్కిసలాట తీవ్రతకు మరియు అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి ఆలయ అధికారులు, సిబ్బంది చేసిన భద్రతా లోపాలే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు మరియు సిబ్బంది ఎలాంటి ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటనతో శ్రీకాకుళం జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.

