SSMB29

SSMB29: SSMB29 సింగిల్ షాట్ సెన్సేషన్.. రూట్ మార్చిన రాజమౌళి!

SSMB29: ఎస్ఎస్ రాజమౌళి… ఈ పేరు భారతీయ సినిమాలో గ్రాండియర్‌కు చిరునామా. ‘బాహుబలి’తో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు, రెండు భాగాల సినిమా ఫార్మాట్‌ను ప్రవేశపెట్టి భారీ విజయం సాధించారు. కానీ, ఇప్పుడు కొందరు దర్శకులు ఈ ఫార్మాట్‌ను దుర్వినియోగం చేస్తూ, ఒకే భాగంలో చెప్పగల కథను రెండుగా సాగదీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఇది బిజినెస్ కోసమేనని, ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతోందని చర్చ నడుస్తోంది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి తన సృష్టిని తానే బద్దలు కొట్టాలని చూస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ గురించి లేటెస్ట్ బజ్ హాట్ టాపిక్‌గా మారింది. మొదట రెండు భాగాలుగా ప్లాన్ అయినా, ఇప్పుడు ఒకే భాగంగా స్ట్రెయిట్‌గా చెప్పాలని రాజమౌళి డిసైడ్ చేశారట.

Also Read: HIT 3: కీలక పాత్రలో మరో బిగ్ స్టార్!

SSMB29: ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్టైల్‌లో నిడివి ఎక్కువైనా, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్‌తో అదరగొట్టనున్నారు. త్వరలో స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్‌కు షాక్ ఇవ్వనున్నారట. రాజమౌళి ఈ నిర్ణయంతో మరోసారి తన మార్క్ చూపనున్నారని ఇండస్ట్రీ టాక్. మహేశ్‌బాబు కెరీర్‌లో ఇది బిగ్ బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంచనాలు పీక్స్‌లో ఉన్న ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి!

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *