Mahesh Babu

Mahesh Babu: SSMB29: మహేష్ బాబు డైనోసర్‌తో ఢీ..!

Mahesh Babu: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘SSMB29’ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సినీ వర్గాల్లో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు ఈ చిత్రంలో చేసే అడ్వెంచర్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయట. ముఖ్యంగా, రాజమౌళి ప్లాన్ చేస్తున్న ఓ భారీ సీక్వెన్స్‌లో మహేష్ ఏకంగా డైనోసర్‌తో పోరాడనున్నారని తెలుస్తోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్‌ను పులితో ఫైట్ చేయించిన జక్కన్న, ఇప్పుడు మహేష్‌తో డైనోసర్ ఫైట్ సీన్‌తో అదరగొట్టనున్నారు.

Also Read: Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’… మేలో బ్యాలెన్స్ షూట్!

Mahesh Babu: అడవి నేపథ్యంలో సాగే ఈ సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ ఆఫ్రికాలో షూటింగ్ జరపనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి మార్క్ విజువల్ వండర్‌తో పాటు మహేష్ యాక్షన్ అదిరిపోనుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గుంటూరు కారం మూవీ వీడియో సాంగ్ : 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  R.krishnaiah: రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *