SSMB29: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రం రాజమౌళి కెరీర్‌లోనే అత్యంత భారీ రన్‌టైమ్‌తో రాబోతోందని బజ్. దాదాపు 3 గంటల 20 నిమిషాలు, అంటే RRRని మించి 200 నిమిషాల విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.
Also Read: Jr NTR: ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆ పుస్తకం ఏంటీ? వైరల్ గా మారిన వీడియో!
SSMB29: హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, జూలైలో కెన్యా ఫారెస్ట్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారు. రూ.50 కోట్లతో కాశీ నగరం సెట్, గ్లోబల్ యాక్షన్ టీమ్‌తో ఇండియానా జోన్స్ స్టైల్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. VFXతో పాటు రియల్ లొకేషన్స్, ఆర్కియాలజికల్ సెట్స్‌తో ఆథెంటిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తి డెడికేషన్‌తో ఉన్నారు.