SSMB 29: తెలుగు సినిమా బౌండరీస్ క్రాస్ చేసేస్తూ.. ఆకాశమే హద్దుగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టాండర్డ్స్ ని ఆ స్థాయికి తీసుకెళ్లింది మాత్రం రాజమౌళీనే. మహేష్ బాబు మూవీతో ఇంటర్నేషనల్ మార్కెట్ పై ఫోకస్ చేశారాయన. ఇప్పుడు SSMB 29 కోసం ఏకంగా హాలీవుడ్ లెజెండ్ ని రంగంలోకి దింపుతున్నారు. ఆ క్రేజీ న్యూస్ ఏంటంటే…
Also Read: Vishal-Anjali: వన్స్ మోర్ అంటున్న విశాల్ – అంజలి..
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఈవెంట్ లో లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్.. రాజమౌళి వర్క్ గురించి ఎంతలా పొగిడారో తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. SSMB 29 ఫస్ట్ లుక్ ఆయన చేతుల మీదుగానే రిలీజ్ చేయించ బోతున్నారట. అవతార్ 3 డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ కోసం ఫస్ట్ టైమ్ ఇండియా వస్తున్నారట జేమ్స్. ఈ సందర్భంగా మహేష్ లుక్ లాంచ్ చేయించాలనేది జక్కన్న ప్లాన్ అట. ఈ క్రేజీ న్యూస్ బయటకు రావడంతో.. ఇదిరా మన తెలుగు సినిమా సత్తా అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.. యానిమల్ ఫంక్షన్లో రణ్ బీర్ కపూర్ జై బాబు అంటాడు కదా.. అప్పుడు తనకి జేమ్స్ తలకాయ తగిలించేశారు. మొన్న బర్త్ డేని బాబ్ డేగా మార్చేసిన ఫ్యాన్స్.. నవంబర్ లో MBని కనిపెట్టేసి.. ఫస్ట్ రివీల్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు.