ss thaman

SS Thaman: ‘పుష్ప-2’కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

SS Thaman: ‘ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్‌’ అంటే ‘పుష్ప-2’ పేరే వినిపిస్తుంది. డిసెంబర్ 5న రాబోతున్న ఈ సినిమా కోసం ఇతర చిత్రాలన్నీ దారి ఇచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప -2’ మూవీ లాస్ట్ సాంగ్ చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులలోనూ వేగంగా పెంచారు. అయితే… ఇక్కడే సుకుమార్ తన కెరీర్ లో ఇంతవరకూ తీసుకోని ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ‘ఆర్య’ మూవీతో మొదలైన సుకుమార్ కెరీర్ లో దేవిశ్రీ ప్రసాద్ తప్పితే మరొకరు సంగీతాన్ని ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: Tollywood: ప్రచారం కోసం స్టార్స్ అమెరికా దారి

SS Thaman: అలాంటిది ఫస్ట్ టైమ్ సుకుమార్ ‘పుష్ప-2’ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ తో ఇప్పించాలని సుకుమార్ భావిస్తున్నాడట. అందుకు దేవిశ్రీ సైతం అంగీకారం తెలపడంతో ఇప్పుడు ‘పుష్ప-2’ టెక్నీషియన్స్ బోర్డ్ లోకి తమన్ అండ్ టీమ్ ఎంటర్ కాబోతోందని సమాచారం. మూవీ ఫైనల్ కట్ పూర్తి కాగానే తమన్ రీ-రికార్డింగ్ పనిలో పడతాడని అంటున్నారు. ఇదే నిజమైతే… సుకుమార్ తీసుకున్న ఈ డెసిషన్ భవిష్యత్తులోని అతని ప్రాజెక్ట్స్ కు వర్తింప చేసే ఆస్కారం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం సూర్య ‘కంగువా’తో పాటు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి, నాగచైతన్య ‘తండేల్’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prakash Raj: బెట్టింగ్ యాప్‌లపై ఇకపై ప్రచారం చేయను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *