SSMB29

SSMB29: బాహుబలి స్థాయి సెట్.. SSMB29 ఈవెంట్ హైలైట్!

SSMB29: టాలీవుడ్ సినీప్రియులకు మరో సంచలన అప్డేట్ రాబోతోంది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త చిత్రం నుంచి టైటిల్ అనౌన్స్‌మెంట్ నవంబర్ 15న జరగనుంది. ఈ ఈవెంట్ కోసం రాజమౌళి అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి స్థాయి సెట్ వేయిస్తుండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

రాజమౌళి సినిమా ప్రమోషన్లలో నిపుణుడు. సినిమాను ప్రేక్షకుల్లో చర్చకు తీసుకురావడంలో అతనికంటే ముందు ఎవరూ ఉండరు. ఈసారి కూడా ఆయన అదే తరహా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈవెంట్ కోసం ప్రత్యేకంగా 100 అడుగుల ఎత్తైన ఎల్ఈడి లైటింగ్ టవర్‌ను నిర్మిస్తున్నారని సమాచారం. ఈ భారీ సెట్‌పై వందలాది టెక్నీషియన్లు నిరంతరం పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సెట్ వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.

‘SSMB29’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. రాజమౌళి ఈ చిత్రాన్ని “వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్”గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా, కెన్యా, నైరోబీ ప్రాంతాల్లో కీలక షెడ్యూల్‌లు పూర్తి కాగా, ఇప్పుడు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి టెంపుల్ నేపథ్యంతో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం సెట్ వేసినట్లు సమాచారం.

Also Read: Bandla ganesh: నిర్మాతగా రీఎంట్రీపై బండ్ల గణేశ్ క్లారిటీ

ఈ ఈవెంట్‌ను మొదటిసారిగా జియో హాట్‌స్టార్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇది భారతీయ సినిమాకు ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈవెంట్‌లో అనేక ప్రత్యేక అతిథులు పాల్గొనబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ ఈవెంట్‌కు హాజరుకావచ్చన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజమౌళి ఈ వేడుకను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు లక్ష మంది ప్రేక్షకులను ఈవెంట్‌కు ఆహ్వానించనున్నారని సమాచారం. ఈవెంట్ స్థాయి, సెట్ అద్భుతత, అంతర్జాతీయ ప్రమాణాల కారణంగా “SSMB29”పై అంచనాలు మరింతగా పెరిగాయి.

సోషల్ మీడియాలో ఇప్పటికే మహేశ్ బాబు అభిమానులు ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో కూడా అదే రోజున విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఈ రోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఈవెంట్‌లతో ఎంతటి హైప్ క్రియేట్ చేయగలడో గతంలో చూసినట్టే, ఈసారి కూడా “SSMB29”ను ఒక గ్లోబల్ ఈవెంట్‌గా మార్చేందుకు ఆయన వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నాడు. నవంబర్ 15న జరగబోయే ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌తో మళ్లీ టాలీవుడ్ అంతా రాజమౌళి మాయలో మునిగిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *