Srisailam Preject:కృష్ణా బేసిన్‌లోని రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతుండగా, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతున్నది. ప్రస్తుతం శ్రీశైలం జలశయానిక జూరాల నుంచి 60,587 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 854.20 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 89,7132 టీఎంసీలకు చేరుకున్నది. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని అధికారులు నిలిపివేశారు.

