Srisailam: దోర్నాల నల్లమల ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒక బస్సు డ్రైవర్ కాలు ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు కలిసి అతడిని బయటకు తీశారు. గాయపడిన వారిని దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా నల్లమల ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శ్రీశైలం వైపు సుమారు 10 కిలోమీటర్లకు పైగా వాహనాల క్యూలు ఏర్పడ్డాయి.