srisailam: శ్రీశైలంలో రెండోవరోజు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

srisailam: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రెండవరోజు భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిని అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు,వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు శ్రీభ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవారు మయూరావాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు.

అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు,చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవంగా కదలివస్తున్న శ్రీస్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారుల,పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *