Anantha sriram: విజయవాడ కేసరపల్లిలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించిన హైందవ శంఖారావం సభలో ప్రసిద్ధ గీత రచయిత అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహాభారతం, రామాయణం వంటి భారతీయ ఇతిహాసాల ప్రాముఖ్యతను వివరించిన అనంత శ్రీరామ్, సినీ ప్రపంచంలో వాటి వక్రీకరణపై తీవ్ర విమర్శలు చేశారు.
కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను అనవసరంగా గొప్పదనంతో చూపించడం హైందవ ధర్మానికి అన్యాయం అని, అటువంటి portrayal పై తాను సిగ్గుపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. కర్ణుడి నైజం, దుర్యోధనుడికి ఇచ్చిన మద్దతు, ద్రౌపదిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తిని శూరుడిగా చూపడం హిందూ సమాజానికి అంగీకారమా అని ప్రశ్నించారు.
అంతేకాకుండా, టాలీవుడ్ పరిశ్రమలో హిందూ పద్దతుల అవమానకర వక్రీకరణను అనుభవించిన ఒక సంఘటనను ఆయన వెల్లడించారు. “బ్రహ్మాండ నాయకుడు” అనే పదం పాటలో ఉండటంతో ఒక సంగీత దర్శకుడు దాన్ని తిరస్కరించాడని, అందుకే 15 సంవత్సరాలుగా ఆయనతో పని చేయలేదని వివరించారు.
అంతిమంగా, హైందవ ధర్మాన్ని కించపరిచే చిత్రాలను ప్రజలే తిరస్కరించాలని, అలాంటి నిర్మాతలను అణగదొక్కాలని పిలుపునిచ్చారు.

