Srinu Vaitla: టాలీవుడ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌ల మాస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్ల, ఇటీవల ‘విశ్వం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయారు. అయినా, ఆయన ఫ్యాన్స్‌లో జోష్ మాత్రం తగ్గలేదు. తాజాగా, శ్రీను వైట్ల తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో రీబౌండ్ అవ్వడానికి సిద్ధమవుతున్నారని టాక్. ఈసారి కూడా ఆయన సిగ్నేచర్ స్టైల్‌లో హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నారట.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో హీరో ఎవరు? శ్రీను వైట్ల ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కామెడీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ల మిక్స్‌తో శ్రీను వైట్ల మళ్లీ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఫుల్ హోప్స్‌లో ఉన్నారు.