Srinivasa Mangapuram: లెజెండరీ సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని ఇంటెన్స్ లవ్ టేల్‌గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా థీమ్ మోషన్ పోస్టర్‌తో పాటు కొత్త సంవత్సరంలో హీరో ఫస్ట్ లుక్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Teja Sajja: జై హనుమాన్ నుంచి తప్పుకున్న తేజ సజ్జ?
ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం థీమ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే 2026 జనవరి 1న జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం మరింత ధైర్యంగా, పెద్దగా ఉంటుందని అజయ్ భూపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. స్వయంభువుగా అవతరించిన విష్ణువు క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథాంశం రూపొందిందని తెలుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. సంక్రాంతి తర్వాత తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. కొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
This NEW YEAR is gonna get Bigger, Better and Braver ❤️🔥
Here’s the Theme Motion Poster of our INTENSE LOVE TALE #SrinivasaMangapuram 🔥
Revealing a riveting First Look of #JayaKrishnaGhattamaneni on January 1st 2026 💥
An @DirAjayBhupathi Film 🎥#RashaThadani @gvprakash… pic.twitter.com/YpiSU8XFGW
— Ajay Bhupathi (@DirAjayBhupathi) December 29, 2025
