Sriharikota: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత బాహుబలి రాకెట్ LVM3-M5 మరొక విజయాన్ని నమోదు చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన CMS-3 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా భూమి కక్ష్యలో ప్రవేశపెట్టింది.
4,410 కిలోల బరువున్న CMS-3, ఇస్రో ఇప్పటివరకు పంపించిన ఉపగ్రహాల్లో అతి భారీ ఉపగ్రహంగా నిలిచింది. రాబోయే 10 సంవత్సరాల పాటు భారతదేశానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ మరియు ఆధునిక కమ్యూనికేషన్ సేవలు అందించడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది.
ఈ విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో మరో ముఖ్యమైన అధ్యాయం రాసుకుంది.

