Sreeleela: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చెయ్యడానికి సిద్ధం అవుతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏకంగా టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తనకి అవకాశం ఇచ్చాడట. భూషణ్ కుమార్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించడానికి ఆమెను ఎంపిక చేసుకున్నాడు.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025కి ముందు గుజరాత్ టైటాన్స్ ఓనర్ మార్పు..!
ఇదే నిజమైతే, శ్రీలీలకి ఇది ఒక క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో వరుస హిట్‌లను అందుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతని సరసన నటించేందుకు శ్రీ లీల సిద్ధం అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.