Mahesh Babu

Mahesh Babu: క్రేజ్ కా బాప్.. సూపర్‌స్టార్ తో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ స్టాఫ్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో అందరికీ తెలిసిందే. ఆయనతో ఒక్క సెల్ఫీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో తాపత్రయపడతారు. ఈ క్రేజ్ ఇండియాతో పాటు విదేశాల్లోనూ కొనసాగుతోంది. తాజాగా మహేష్ బాబు హైదరాబాద్ నుంచి కొలంబోకు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ఈ విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది సంతోషంతో మహేష్‌తో ఫోటోలు దిగారు. ఈ ఫోటోను ఎయిర్‌లైన్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌ను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. సూపర్‌స్టార్ క్రేజ్ ఇంతటితో ఆగదని మరోసారి నిరూపితమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *